రాయపోల్ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు ఇంటింటి ప్రచారంసిద్దిపేట జిల్లా, రాయపోల్ మండలం, రాయపోల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి పుట్ట రాజు శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. పుట్బాల్ గుర్తుతో పోటీ పోతున్న ఆయన, గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కేటాయించి గెలిపించాలని కోరారు. గతంలో గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు, పెండింగ్ పనులను పూర్తి చేసే ప్రణాళికల గురించి వివరించారు. రోడ్లు, నీటి సరఫరా, యువత ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. యువకులు, మహిళలు, అందరూ కలిసి పుట్ట రాజువిని గెలిపించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన పిలుపు నిచ్చారు.





