రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ గురువారం రోజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండలంలో రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆలకట్టు ఎల్లయ్య (56) అనే వ్యక్తి ఇటీవల తన కొడుకు నవీన్ గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు అప్పులు చేశాడు. కుమారుడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అనే బెంగతో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
ఎల్లయ్యను గమనించిన కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా గురువారం సాయంత్రం మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి ఎల్లయ్య కుటుంబ సభ్యుల కళ్ళముందే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. మృతునికి భార్య లక్ష్మి,కుమారుడు నవీన్ లు ఉన్నారు.




