సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్): చాట్లపల్లి గ్రామం వినాయక్ యూత్ లడ్డు వేలం పాట రూ.154000..
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డు వేలంపాట నిర్వహించగా గ్రామానికి చెందిన దాసరి ఐలయ్య జిల్లాలోనే అత్యధికంగా రూ.154000 అక్షరాల ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయల పాటతో ఎంతో మహిమ కలిగిన వినాయక యూత్ కమిటీ లడ్డును కైవసం చేసుకున్నారు.లడ్డు గ్రహీత దాసరి ఇలయ్యకు వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాలువతో ఘన సన్మానం చేసి లడ్డును సాంప్రదాయం ప్రకారం అందించడం జరిగింది