నేడు శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో గీతా జయంతి ఉత్సవాలను 2024 ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బ్రహ్మాశ్రీ డా॥ ఎల్ వి గంగాధర శాస్త్రి, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, వ్యవస్థాపక అధ్యక్షులు భగవద్గీత ఫౌండేషన్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత అంటే కేవలం ఎవరైనా చనిపోయినపుడు పెట్టే గీత కాదు అది మన జీవన విధానం మరియు మన మనిషి గా జన్మ ఎత్తినందుకు మన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోవడానికి, మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించటానికి, మనల్ని మనం సన్స్కరించుకోవడనికి ఒకే ఒక్క మార్గం భగవద్గీత పారాయణం మరియు ఆచరించడం, అప్పుడే మన సమాజం, మన ధర్మం బాగుంటుంది అని తెలియ చేశారు.ప్రతి తల్లి, తండ్రి పిల్లలకు భగవద్గీత చిన్నప్పటి నుండి నేర్పించినచో వారిలో ఎంతో ఆత్మ స్తిర్యం పెరుగుతుంది, జీవితం లో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదురుకుంటారు, అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోనె శ్యామ్ సుందర్ ,శ్రీ భగవద్గీత అధ్యయన మండలి కమిటీ సభ్యులు ఎం. సత్యనారాయణ ,కటుకం హరీష్ ,ద్రాక్షపల్లి చంద్ర శేఖర్, డాక్టర్ కె.కృష్ణ, డాక్టర్.కె సుగుణాకర్ రెడ్డి ,మల్లారెడ్డి,సత్య సాయి సంస్థ,వికాస తరంగిణి జెట్, ఆర్ ఎస్ ఎస్, లలిత సేవాసమితి సంస్థల సభ్యులు , గుండా సుధాకర్, పట్టణ ముఖ్య ప్రముఖులు, న్యాయవాది నటేశ్వర్, తుల ఆంజనేయులు, పెద్దింటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గోనె శ్యామ్ సుందర్ రావుని సన్మానించారు.





