Breaking News ప్రాంతీయం

అనాధ యువతకి బాసటగా.. -వివాహానికి పుస్తే మెట్టెలు పంపిణీ -పేద కుటుంబాలకు సహాయం చేసేందుకు ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రథమమే -ఫౌండేషన్ అధ్యక్షురాలు సుల్తానా ఉమర్

146 Views

బాల్య దశలోనే తల్లి, తండ్రి నీ కోల్పోయిన ఓ అనాధ యువతకి ఎస్ ఆర్ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. అనాధగా మారిన యువతి కి మేమున్నామంటూ ముందుకు వచ్చింది.వివాహానికి పుస్తె మెట్టెలు అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.పెళ్లి కి పెద్దగా నిలిచి ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ప్రజల నుండి ప్రశంసలు అందుకున్నారు. దౌల్తాబాద్ మండలం దీపాయం పల్లి గ్రామంలో నిరుపేద వధువు గొల్ల సమీరా కు మూడు సంవత్సరాల క్రితం విధి వక్రించడంతో తల్లిదండ్రులైన గొల్ల అనసూయ-మల్లేశం దంపతులు ఇద్దరు మృతి చెందారు. వీరికి ఇరువురు సంతానం కాగా సమీరా, సందీప్ లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోవడంతో అక్క తమ్ముళ్లు అనాధలుగా మారారు. పెద్దదిక్కు లేకపోవడంతో పెంచిపోషించేవారు కరవయ్యారు. దీంతో ఇద్దరు పిల్లలు హాస్టల్ లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించారు. సమీరా విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడంతో బంధువుల సహకారం తో వివాహం నిశ్చయించారు. వీరి కుటుంబం పెద్ద దిక్కులేని నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహకారంతో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు.అసలే నిరుపేద కుటుంబం సమీరా వివాహానికి సహకారం అందించాలని భావించి పుస్తె మెట్టెలు, చీర అందజేయడం జరిగిందని ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుల్తానా ఉమర్ పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు కృషి చేస్తుందన్నారు. అనాధలను అభాగ్యులను ఆదుకునేందుకు తమ సంస్థ ప్రథమంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, సీనియర్ జర్నలిస్టులు శంభు లింగం, మహేష్, యాదగిరి, గ్రామస్తులు కుమార్, సందీప్,సురేష్,యాదగిరి,భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *