బిసి స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్
ములుగు జిల్లా,సెప్టెంబర్ 27
మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచి తెలంగాణ ఏర్పా టులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాక రాజనీతిజ్ఞుడుగా కీర్తిని పొంది చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో అణగారిన వర్గాల హక్కులు సాధించాలని బిసి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ న్యాయవాది సాయిని నరేందర్ అన్నారు.హన్మకొండ జిల్లా కేంద్రం జిల్లా కోర్టు ప్రాంగ ణంలో హన్మకొండ వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో బుధవారం జరిగి న కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన ధీశాలి, తెలంగాణ కోసం మంత్రి పదవి ని తృణప్రాయంగా వదలు కోవడమే కాకుండా మండల్ రిజర్వేషన్లకు రాజీవిగాంది వ్యతిరేకంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బహుజన టైగర్ బాపూజీ అని ఏక కాలంలో నిజాం వ్యతిరేక పోరాటం వెనుకబడిన తరగతుల ఉద్యమం చేనేత సహకారో ద్యమం తెలంగాణ రైతాంగ పోరాటం స్వాతంత్రోద్యమం తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలు చేసిన బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ మోహన్,ప్రధాన కార్యదర్శి యాక స్వామి,ఉపాధ్యక్షుడు ఆనంద్ మోహన్,జాయింట్ సెక్రటరీ ఆడెపు కవిత, కోశాధికారి అమృతరావు, కార్యనిర్వాహక సభ్యులు సిరిమల్ల అరుణ,హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు దయాన్ శ్రీనివాస్, క్రీడల కార్యదర్శి విజేందర్,కార్యనిర్వాహక సభ్యులు బొమ్మరాజు అనిల్ యాదవ్,సీనియర్ న్యాయ వాదులు ప్రేమ్ సాగర్,ఇత ప్రసాద్,చిల్ల రాజేంద్రప్రసాద్, చీదర్ల రవికుమార్,వలస సుధీర్, మాతంగి రమేశ్ బాబు, జి ఆర్ శ్రీనివాస్,బత్తిని రమేశ్ బాబు,సిద్ధం యుగెందర్,గంజి రమేశ్,రాయబారపు బిక్షపతి, నీల శ్రీధర్, మహాత్మ,రాచకట్ల కృష్ణ,పాము రమేశ్,గురిమిల్ల రాజు,కూనూరు రంజిత్ కుమార్,తదతరులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.