ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 23, ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ బొమ్మెన తండ్రి అశోక్ రావు 2014లో హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, పి రాజా శ్రీపతి రావు కార్యాలయంలో అతను తన ప్రాక్టీస్ ను ప్రారంభించాడు. అతను సివిల్, క్రిమినల్, కన్స్యూమర్ మరియు కంపెనీ లాస్ వైపు తనప్రాక్టీస్ ను ప్రారంభించాడు. కె.టి.రామారావు, బి. వినోద్ కుమార్ మరియు అడిషనల్ అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు, సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైనందుకు బి.రవీంధర్ రావు ఎజిపి సిరిసిల్ల, వుచ్చిడి శరత్ రెడ్డి, మల్లారపు సంతోష్ రెడ్డి న్యాయవాదులు మరియు బిఆర్ఎస్ నాయకులు జనగామ శరత్ రావు, చీటి జితేందర్ రావు, చీటి వెంకటేశ్వర్ రావు ఫోన్ ద్వారా అభినందించారు.
