విపత్తు నిర్వహణ శాఖ వివరాలు ఎప్పటికపుడు అప్డేట్ చెయ్యాలి.
-అన్ని శాఖల అధికారులు మీ వద్ద ఉన్న డాటా ను శాఖకు అందించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కే. హైమావతి
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 19, ( తెలుగు న్యూస్ 24/7 )
ముoదస్తు అప్రమత్తత ద్వారా విపత్తుల సమయంలో ప్రాణ నష్టాలను నివారించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.
శుక్రవారం, ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమ నిర్వహణ, వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై సిఎస్ రామకృష్ణ రావు, జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి) అధికారులతో కలిసి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ నెల 22 న విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లను ఆదేశించారు. ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్కర సమయాల్లో ప్రాణ నష్టాలు నిర్వహించడంతో పాటు, ఆస్తి నష్టాలు తగ్గించగలుతామని చెప్పారు. పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలను తగ్గించగలుగుతామని వివరించారు. వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని అన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని సాధనాలు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వైపరీత్యాల సమయంలో ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. దాదాపు 35 శాఖలు సమన్వయంతో మెలగాలని తెలిపారు. వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టం, నీరు విడుదల, వంతెనలు, రోడ్ల స్థితి వంటి అంశాల రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని చెప్పారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమగు అన్ని సేవల టోల్ ఫ్రీ నంబర్ల సమాచారం ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, వైద్య సేవలు అనేవి వైపరీత్యాల సమయంలో అత్యంత కీలకమని అన్నారు. రాష్ట్రంలోని ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహకారం అందిస్తాయని తెలిపారు. అవసరమైతే అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవచ్చు అని అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు విపత్తు నివారణ చర్యలపై పలు అంశాలను కూలంకషంగా చర్చించారు.
జిల్లా కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ…
విపత్తు నిర్వహణ శాఖ వివరాలు ఎప్పటికపుడు అప్డేట్ చెయ్యాలి. అన్ని శాఖల అధికారులు మీ వద్ద ఉన్న డాటా ను శాఖకు అందించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా విపత్తు సంభవిస్తే వెంటనే స్పందించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, డిఎచ్ఓ సువర్ణ, డిసిఎస్ఓ తనూజ, డిఏఓ స్వరూపరాణి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణేష్ రామ్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టడ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ధర్మారెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్ రెడ్డి, డిఎంఅండ్ఎచ్ఓ ధనరాజ్, ఫైర్, ట్రాన్స్పోర్ట్, నీటిపారుదల, మున్సియల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.





