ఆమరణ నిరాహార దీక్షకు అయిన సిద్ధం
బీజేపీ కిసాన్జా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి రామ రాజు నేత
ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు జాడి రామరాజు నేత బుధ వారం మధ్యాహ్నం నుంచి ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ తో పాటు బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ
నిరాహార దీక్షకు కూర్చున్నారు. వారు మాట్లాడుతూ ఉద్య మాన్ని ఉధృతంగా చేస్తామని అన్నారు.అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కావడానికి అన్ని అర్హ తలు ఉన్నప్పటికీ పాలకుల గానే పట్టించుకోకపోవడం వల్ల నిరాహార దీక్ష చేయడం జరు గుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం నాగారం మండల కేం ద్రాన్ని రెవెన్యూ డివిజన్ పరి ధిలో తాడ్వాయి మంగపేట వాజేడు వెంకటాపురం 275 రెవెన్యూ గ్రామాలు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాలకు దూరంలో ఉంటే ఏదో ఒక మండలాన్ని రెవిన్యూ డివిజన్ కి ప్రకటించవలసింది పోయి ఇంతవరకు చేయకపోవడం బాధాకరం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రకటించాలని అన్నారు.ఒకవేళ ప్రకటించ కపోతే ఉద్య మాన్ని ఉధృతం చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వావిలాల జనార్ధన్,మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు,మండల ఉపాధ్యక్షులు కర్నే సంపత్, వట్టం అమృత,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈక మహాలక్ష్మి,యువ మోర్చా మండల అధ్యక్షులు వినుకొల్లు చక్రవర్తి,మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పాలక గంగ,మహిళా మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కంకణాల నిర్మల,శక్తి కేంద్రాల ఇన్చార్జి ఎలకపల్లి శ్రీనివాసు,బూతు కమిటీ అధ్యక్షులు మాదరి రమేష్,యానాల చంద్రారెడ్డి, బూతు కమిటీ ఉపాధ్యక్షులు సోయం బద్రి,పోరెడ్డి వెంకన్న, యువమోర్చా మండల అధ్య క్షులు ప్రవీణ్,ఏటూరునాగారం మండల నాయకులు బొల్లె శ్రీనివాస్,బూతు అధ్యక్షులు నరాల శ్రీనివాసు,ఆత్కూరి ప్రేమలత,గండేపల్లి రజిని, ఉన్నారు.