Breaking News

భారీ బందోబస్తు

216 Views

పోలీస్ భారీ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనం

హైదరాబాద్ :సెప్టెంబర్ 27

వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టించారు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల శోభాయాత్ర జరగనుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25,694 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన జంక్షన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పారామిలిటరీ బలగాలతో భద్రత నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు.

ప్రతి విగ్రహానికి ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వినియోగించుకోవడానికి అంబులెన్స్‌లను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *