ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 17, బీసీ విద్యా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు చేరడం జరిగింది. వాళ్లకు సాధారణంగా కండోవ కప్పి స్వాగతం తెలిపిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అనంతరం మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘంలో చేరినందుకు సంతోషమని అన్నారు. విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా చేరిన విద్యార్థులు విద్యా వ్యతిరేకనులపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు సమస్యలన్నీ పరిష్కరించాలని అన్నారు. లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానంతోనే వచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోని వెంటనే పరిష్కరించాలని అని అన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రుద్రవీణ సుజిత్ మరియు చేరిన వారు ఎలా చింటూ, గూట్ల రాహుల్, పరకాల సిద్ధార్థ, చింత వినయ్, కోడి రోహిత్, తడక రమణ, ప్రశాంత్, నరేష్, ఎండి సాహెబ్, ఎండి హసన్, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




