సెప్టెంబర్ 27 వర్దన్నపేట
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోనీ డివిజన్ల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.
గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం, కోమటిపల్లితో పాటు పలు కాలనీలో 10కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హళ్ల నిర్మాణ పనులకుఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, కాలనీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతీ గడపకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ద్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, డివిజన్ ప్రెసిడెంట్ అటికం రవీందర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
