ఆదివాసుల ట్రైకార్ లోన్స్ ఏమయ్యాయి?
పట్టించుకోని అధికారులు
ఏటూరునాగారం,సెప్టెంబర్ 03
ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో 2020-21 రుణాలు మంగపేట మండలంలో ట్రైకా రుణాలు మంజూరై గ్రామ సభల ద్వారా ఎన్నికైన 274 లబ్ధిదారులకు మంజూరైన రుణాలు ఇవ్వాలని సభ్యులం దరికీ సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాకు జమకాక (ఐటిడిఏ) చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు ఆదివాసుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆదివాసీలు వారి బాధలు అధికారులకు అర్థం కావడం లేదని తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల అభివృద్ధి విషయంలో పత్రిక ప్రకటనలో అభివృద్ధి చేస్తు న్నామని చెప్పి కాలం వెళ్ళబు చుతున్నారు.జూలై 10న ప్రజాధర్బాల్లో ఐటిడిఏ (పిఓ)కి వినతి పత్రం ఇచ్చి రెండు నెలల సమయం పడుతుంది ఆదివాసీల ట్రైకార్ లోన్లు విషయంలో (2) సంవ త్సరాల క్రితం గ్రామ సభలు పెట్టి ఆదివాసి లబ్ధిదారులకు తీవ్రంగా జాప్యం చేస్తున్నారు రాబోయే రెండు నెలల్లో ఎలక్ష న్లు వస్తున్నాయి ఇలాంటి మాయమాటలకు ఆదివాసులు నమ్మి మోసం చేస్తున్నారని కావున ఇట్టి రుణాలు సబ్సిడీని త్వరగా లబ్ధిదారుల ఎకౌంట్లో పడేవిధం గా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన మండల అధ్య క్షుడు పోలేబోయిన ఆదినారా యణ,మండల నాయకులు ఎడం సమ్మయ్య,తుడుందెబ్బ జిల్లా నాయకులు పొడెం నాగేశ్వర రావు,ఎట్టి సారయ్య,లబ్ధి దారులు పూనెం కృష్ణవేణి, పోలేబోయిన వెంకటమ్మ,తెల్లం యాదమ్మ,తాటి అంజలి, దన్నూర్ కుమారి,వజ్జా వరప్రసాద్,పాల్గొన్నారు.