ములుగు జిల్లా మంగపేట, సెప్టెంబర్ 26
మంగపేట మండలం రాజుపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ రెన్యూవల్ పైన అవగా హన కార్యక్రమం నిర్వహిం చారు.ఈ కార్యక్రమంకు రాజుపేట కెనరా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ రుణమాఫీ వచ్చి న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా రెన్యూవల్ చేసుకోవాలని తద్వారా మళ్ళీ రుణం పొంద గలరు అని చెప్పారు.2018 డిసెంబర్ లోపు రుణం తీసు కున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పారు. ఏఈఓ మహేష్ మాట్లాడుతూ రుణమాఫీ కొంత మంది రైతులకు వచ్చి అకౌంట్ క్లోజ్ ఉండటం డిబిటీ ఫెయిల్ వల్ల డబ్బు తిరిగి వెళ్ళిపోయింది అని చెప్పారు.ఇందులో చాలా మంది రైతులవి తిరిగి అప్డేట్ చేయడం జరిగింది అని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఈఓలు మహేష్,భావన, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.