జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ
ములుగు జిల్లా,సెప్టెంబర్ 26
పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిం చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ ములుగు జిల్లా అధ్య క్షులు డిమాండ్ చేశారు.చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు చారిత్రక అవస రమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్య క్షులు చెప్పారు.పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపా లని డిమాండ్ చేశారు.మహి ళా బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. మహిళలకు విస్తృత అవకా శాలు లేకపోతే దేశ ప్రగతి కూడా సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రత్యేక సమావేశాల్లో సుదీర్ఘకాలం పెం డింగ్‌లో ఉన్న మహిళా రిజర్వే షన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇండియా కూటమి ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లు కు ఆమోదం తెలపడానికి కదలిరావాలనిన్నారు.అన్ని రంగాల్లో మహిళలకు అన్యా యమే జరుగుతోందని ములుగు జిల్లా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళి క్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభిం చడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవ కాశంకలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు,ములుగు జిల్లా యూత్ అధ్యక్షుడు తోటకూరి శ్రీకాంత్,బీసీ సీనియర్ నాయ కులు ఇందారపు మహేష్ కుమార్,పాల్గొన్నారు.




