ఎల్లారెడ్డిపేట జనవరి 28 :
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడానికి మన ముఖ్యమంత్రి కెసిఆర్ 7289 కోట్ల రూపాయలు కేటాయించారని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు తెలిపారు ,
ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రదానోపాద్యాయులు దబ్బెడ హాన్మండ్లు అద్యక్షతన *మన ఊరు మన బడి* కార్యక్రమం జరిగింది ,
ఈ సందర్భంగా జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాటశాలలకు దీటుగా అబివృద్ది పరచటానికి అందరికి విద్య అందించాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ మౌళిక వసతులు కల్పిస్తుందన్నారు ,
ఈ సందర్భంగా ప్రదానోపాద్యాయులు దబ్బెడ హాన్మండ్లు ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాటర్ ట్యాంక్ , డైనింగ్ హాల్ నిర్మించాలని , పడిపోయిన ప్రహారి గోడ నిర్మించాలని ,రెండు తరగతి గదులు పునహానిర్మాణం చేయాలని , ప్రయోగశాలకు కావలసిన పరికరాలు , ర్యాక్స్ మంజూరు చేయాలని , ఆట స్థలంలో మట్టి పోయించి చదును చేయించాలని , డ్రైనేజీ నిర్మించాలని పాఠశాల భవనానికి రంగులు వేయించాలని , పాఠశాల కు గేటు నిర్మించాలనీ అందుకు నిధులు ఇప్పించాలని కోరారు ,
పాఠశాల మౌళిక సదుపాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకవెళ్ళి నిధులు విడుదల చేయిస్తామన్నారు ,
ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , సింగిల్ విండో అద్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , పాఠశాల విద్యాకమీటీ చైర్మన్ బాల్ రాజ్ యాదవ్ , ఎంపిటిసి ఎలగందుల అనసూయ నర్సింహులు , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం , ఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి , పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
