ప్రాంతీయం

సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా…

265 Views

ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు. పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు…? అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మందులు అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, లేబర్ రూమ్ లో సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని కలెక్టర్ సూచించారు.

సామాజిక ఆరోగ్య కేంద్రం కోసం నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. వేగవంతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *