ప్రాంతీయం

పట్టుదల ఫలితం: సి ఎమ్ ఏ అర్వపల్లి అఖిల నాగ రమ్య ఘన విజయం

54 Views

పట్టుదల ఫలితం: సి ఎమ్ ఏ అర్వపల్లి అఖిల నాగ రమ్య ఘన విజయం

ఖమ్మం, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7

ఖమ్మం నగరానికి చెందిన అర్వపల్లి అఖిల నాగ రమ్య గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజ్‌లో సిఎంఏ (కాస్ట్ అండ్ మానేజ్మెంట్ అకౌంటెంట్) కోర్సును పూర్తి స్థాయిలో విజయవంతంగా ఉత్తీర్ణతతో సాధించారు. నిరంతర శ్రమ, క్రమశిక్షణతో కూడిన చదువు ఆమెను ఈ ఉన్నత విజయానికి చేర్చిందని ఉపాధ్యాయులు ప్రశంసించారు.అఖిల నాగ రమ్య 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మామిళ్ళ గూడెం లోని మాంటిస్సోరి హైస్కూల్‌ లో విద్యనభ్యసించి, టెన్త్‌లో 9.5 జి.పి.ఎ సాధించారు.సాహితి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లలో కాలేజ్ టాపర్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు.ఆమె తల్లిదండ్రులు అర్వపల్లి నాగేష్, శ్రీలక్ష్మి స్థానికంగా చిన్న కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ కుమార్తె చదువుకు అన్ని విధాలుగా వారి సంపూర్ణ సహకారం అందించారు. చెల్లెలు యువ నాగశ్రీ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు, అలాగే ఆమె చిన్ననాటి స్నేహితురాలు షేక్ తబస్సుమ్ అఖిల నాగ రమ్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *