*బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి*
*మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
*రాయపోల్ మండలంలో ఇంటింటా ప్రచారం.
*వివిధ పార్టీల నుండి పలువురు బిఆర్ఎస్ లో చేరిక.
బిఆర్ఎస్ తోటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమని మెదక్ పార్లమెంటు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని మంతూరు, అనాజిపూర్, చౌదరి పాలెం, చిన్న మాసన్ పల్లి, చిన్న ఆరేపల్లి, లింగారెడ్డి పల్లి, కృష్ణ సాగర్, కొత్తపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించాలన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను అమలు చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దే కనిపిస్తుందన్నారు. 50 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, ఇతర పాలకులు చేయలేని అభివృద్ధిని 9 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారాన్నారు.రూ.400 వందల కే సిలిండర్, మహిళలకు భీమా, సన్నబియ్యం, పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మి పథకం రూ. లక్ష నుండి రూ. రెండు లక్షలకు పెంచడం జరిగిందన్నారు.రైతుబంధు పెంపు వంటి పథకాల ను మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ చేర్చారని వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి గ్రామానికి కాలువల ద్వారా గ్రామంలోని చెరువులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆయా గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న పనులను గెలిచిన తర్వాత పూర్తి చేస్తామన్నారు.గతంలో ఎన్నో హామీలను ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు.రాష్ట్రo లో బిజెపి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని అలాంటప్పుడు బిజెపి పార్టీకి ఓటు వేస్తే చెత్తకుండీలో వేసినట్టేన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులను నేడు ఆయన కుమారుడు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కారు గుర్తుకు ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యాదగిరి, రైతుబందు సమితి మండల అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకట నరసింహారెడ్డి,మామిడి మోహన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచ్ల పోరం మండల అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు వెంకట్రామిరెడ్డి, శోభ, బుచ్చమ్మ, అమృత భాయ్,మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా నాయకులు గణేష్, వెంకట్ గౌడ్, ఇప్ప దయాకర్, తిగుల్ల స్వామి, దయాకర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి రాజ గౌడ్,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




