Breaking News

భగవద్గీత శ్లోకాలు, బాలబాలికల నోట రాగాలు.

423 Views

వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామం సెప్టెంబర్ 26: మజీద్ పల్లి ప్రైమరీ స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులు గ్రామంలోని శివాలయంలో భగవద్గీత శ్లోకాలు ఆలపించడం జరిగింది.

గత కొద్ది రోజుల నుండి చిన్మయ మిషన్ నుండి వచ్చిన గౌతమి మరియు తుమ్మల రమ్యలు ఇరువురు విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతా కుమారి, ఉపాధ్యాయులు ఎస్. అరుణ, ఆర్. అనురాధ, కె. కరుణశ్రీ, విద్యా వాలంటరీలు సుజాత, నవీనలు పాల్గొన్నారు.

విద్యార్థినీ విద్యార్థులకు మంచి విద్య, విద్యతో పాటు భక్తి మార్గంలో నడిపిస్తున్నందుకు గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బందికి శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది.

ప్రైమరీ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా భగవద్గీత శ్లోకాలు ఆలపించారని, భగవద్గీత శ్లోకాలు రాని విద్యార్థి ఒక్కరు కూడా లేరని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గీతకుమారి తెలియజేశారు.

అంతేకాకుండా భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహిస్తున్నారని ఆ పోటీలు వివిధ స్థాయిలో జరుగుతాయని తెలిపారు.

భగవద్గీత శ్లోకాల పోటీలు మూడు దశలలో నిర్వహిస్తున్నారని అక్టోబర్ నెలలో ప్రాథమిక స్థాయిలో, జిల్లాస్థాయిలో నవంబర్ నెలలో, రాష్ట్రస్థాయిలో డిసెంబర్ నెలలో జరుగుతాయని ప్రధానోపాధ్యాయురాలు గీతా కుమారి తెలియజేశారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *