కలెక్టరెట్ లో రౌండ్ ద క్లాక్ పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు
– ఏదైనా సహాయం, సమాచారం కోసం మొబైల్ నెంబర్ ను 9398684240 లో సంప్రదించాలి
– భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో అధికారులు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.భారీ వర్ష సూచన దృష్ట్యా ఏదైనా సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూం మొబైల్ నెంబర్ 9398684240 ను సంప్రదించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా అధికారులు క్షేత్ర అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఇదిలా ఉండగా.. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉందని, రాగల రెండుమూడురోజుల్లో రోజుల పాటు పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు ఉతర తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది.
