పి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ
నమోదు 2026-2027 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగదేవపూర్ మండల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్ శర్మ , పత్రికా సంపాదకవర్గ సభ్యులు పిన్నింటి రామకృష్ణారెడ్డి విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ సేకరణలో భాగంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలైన పి ఆర్ సి, పెండింగ్ బిల్లులు దసరాలోపు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు.2003 డి ఎస్ సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కోరారు. అలాగే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ప్రకారం వేతనాలు మరియు కేజీ బి వి ఉపాధ్యాయుల పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన కృషి ఫలితంగా దేశంలో మన రాష్ట్రం 18వ స్థానంలో నిలవడం అభినందనీయం. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు
ఐదుగురు ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రాథమిక విద్య ఎంతో బలంగా ఉంటుందని పత్రికా వర్గ సంపాదకులు రామకృష్ణారెడ్డి
తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతిలో భాగంగా ప్రభుత్వము మంజూరు చేసిన స్కావెంజర్ పోస్టుల భర్తీ, ఉచిత కరెంటు, సన్న బియ్యం,విద్యార్థులకు ప్రత్యేకంగా అందజేస్తున్న విద్యా కిట్స్ అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మండల అసోసియేట్ అధ్యక్షులు నగేష్,ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, కార్యదర్శి రంజిత్ కుమార్, శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.





