ప్రాంతీయం

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఏ.ఎమ్.సి దోమల కొమురయ్య

114 Views


*తొగుట* వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని లింగాపూర్, ఎల్ బంజేరు పల్లి, బండారు పల్లి గ్రామాల్లో ఐకేపీ, ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య,
సర్పంచ్ లు బిక్కనూరి రజిత శ్రీశైలం, కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, రాచకొండ మంజులతో కలిసి ఆమె ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు..మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, రైతు బంధు అధ్యక్షులు బోధనం కనకయ్య లు మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అకాల వడగండ్ల వర్షంతో మండలంలోని పలు గ్రామాల రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నష్ట పోయిన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామన్నారు..సీఎం కేసీఆర్ కృషి తో సాగునీళ్లు, కరెంటు సరఫరా అందడంతో..పెద్ద ఎత్తున పంటలు సాగుచేయడం జరుగుతుందన్నారు..చివరి గింజ వరకు వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు..కార్యక్రమంలో ఐకేపీ apm ముగ్దుమ్ అలీ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, డైరెక్టర్లు కిరణ్ కుమార్ రెడ్డి, సతీశ్, సంతోష్ యాదవ్, ఉప సర్పంచ్ లు రమేష్, చంద్రయ్య, కిషన్, సీసీలు దేవదాస్, రజని, సీఏలు శ్రీనివాస్ రెడ్డి, రాములు గౌడ్, శ్రీనివాస్ నాయకులు మంతూరి రమేష్, మల్లేశం, స్వామి, యాదగిరి, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *