*ముందస్తుగా బిఎస్పి నాయకులు అరెస్ట్*
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తుగా బిఎస్పి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు బిఎస్పి పార్టీని చూసి భయపడుతున్నారని అన్నారు. ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసిన భయపడేది లేదన్నారు. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చూస్తేనే బిఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతుందని ఉన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. వచ్చేది బహుజన రాజ్యమేనని అన్నావు. టీఎస్పీఎస్సీ ద్వారా స్కామ్లు, స్కీములు మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో ఉందన్నారు. ఎట్టి పరిస్థితిలో టీఎస్పీఎస్సీని జరగనివ్వమని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో రాయపోల్ మండల అధ్యక్షులు స్వామి, వేణు, బాబు తదితరులు ఉన్నారు.