దౌల్తాబాద్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె లో భాగంగా బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో పారిశుద్ధ్య కార్మికులు బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మండల కార్మిక సంఘం అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ 21 రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బాలరాజ్, రాములు, నాగరాజు, మల్లేశం, మమత, నర్సింలు, భాగ్య, బాలవ్వ, కిషన్, దాదే ఖాన్, ఎక్బాల్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు….




