వర్గల్ సెప్టెంబర్ 25: వర్గల్ మండల కేంద్ర పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ జుబేర్ పాషా వాలీబాల్ కిట్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి , గజ్వేల్ ఏసిపి రమేష్ పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వర్గల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి,ఎంపీపీ లతా రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ కడపల బాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు దేవగనిక నాగరాజు, వర్గల్ మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు లింగ నాగరాజు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్ వెంకటేష్ మరియు సద్దాం హుస్సేన్, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
