అవినీతి పూరిత టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి బీఎస్పీ
సిద్దిపేట సెప్టెంబర్ 25
బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన అవినీతిమయమైన టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తి రద్దు చేయాలని బీఎస్పీ కార్యకర్తలు కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ హరీష్ రావు ను మెప్పించడానికి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా బిఎస్పీ నాయకులను పోలీస్ జీపులకు గుద్దుతూ బూతులు తిడుతూ అమానుషంగా వ్యవహరించి, అక్రమంగా అరెస్టు చేసి రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని పోరాడే ఏకైక పార్టీ బిఎస్పీ అని, టిఎస్పిఎస్సి బోర్డును రద్దుచేసి నూతన బోర్డును ఏర్పాటు చేసే వరకు మా పోరాటం ఆపమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ , జిల్లా కార్యదర్శిలు కొండనోళ్ల నరేష్,కెతోజి వినోద్ చారి ,సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ , దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు జింక సంజీవ్, సిద్దిపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు పంగ బాబు ప్రధాన కార్యదర్శి ఇర్ల మల్లేష్ ముదిరాజ్, గజ్వేల్ నియోజకవర్గ కోశాధికారి మొండి కర్ణాకర్ , కనకప్రసాద్,కర్ణాకర్,రవి, వంశి పలువురు పాల్గొన్నారు.





