Breaking News

పిటిషన్ దాఖల్

134 Views

గ్రూప్ 1 ఫిలిమ్స్ రద్దు పై టిఎస్పిఎస్ పి పిటిషన్ దాఖల్

హైదరాబాద్:సెప్టెంబర్ 25

తెలంగాణ పబ్లిక్ సర్వీస్క మిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై సోమవారం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.

ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు టిఎస్‌పిఎస్‌సి న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది.

ఇప్పటి కే ఒకసారి రద్దయిన గ్రూప్1 ప్రిలిమ్స్, కోర్టు తీర్పుతో రెం డోసారి రద్దయితే.. అభ్యర్థులు మానసికంగా తీవ్ర ఆం దోళనకు గురవుతారని కమిషన్ భావిస్తోంది.ఈ మేరకు డివిజన్ బెంచ్ ముందు పిటిషన్ వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికల నిర్వహణ విధుల్లో నిగమ్నమైపోతుంది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే దాదాపు 2024లోనే మళ్లీ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష జరిగే అవకాశం కనిపిస్తోంది.

అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం

గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు కావడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఒకసారి రద్దు కావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పు డు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందేమో అని ఆందోళన వ్య క్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడా ది ఏప్రిల్‌లో గ్రూప్1 నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో వెలువడిన గ్రూప్ 1 ప్రిలి మ్స్ ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి 128 నియామకాలు పూర్తి చేసింది…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *