దౌల్తాబాద్: మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలం కావడం సిగ్గు చేటు అని దుబ్బాక మాదిగల రాజకీయ చైతన్య వేదిక కో కన్వీనర్ దండోరా శివరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 29 సంవత్సరాల నుండి మాదిగ, మాదిగ ఉప కులాల ఎస్సీల లో ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడి వర్గీకరణ చేయడం మూలంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు జనాభా నిష్పత్తి ప్రకారం మా జనాభా ఎంతో మాకు అంతా వాటా అన్ని రంగాల్లో కల్పించాలని,మాదిగ దండోరా ఉద్యమం నిరంతరంగా ఎన్నో ఉద్యమాలను చేస్తూ దేశవ్యాప్తంగా దండారా ఉద్యమానికి మద్దతు కూడా కట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, మాదిగల ఉద్యమం రాజ్యాంగబద్ధమైనదని ప్రజాస్వామిక బద్ధమైందని మాదిగల ఉద్యమం న్యాయ సమ్మతమైందని ఎస్సీ వర్గీకరణలో ఏ బి సి డి లు జరుగుతూనే మాదిగల భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన విషయమే అని అన్నారు .కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు జీవోలు అనే పేరు మీద మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో చట్టబద్ధత కలగకుండా మద్దతు ఇవ్వకుండా మాదిగలకు అన్ని రంగాలలో అన్యాయమే చేస్తున్నారని భావిస్తున్నామన్నారు. గత పది సంవత్సరాల నుండి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాదిగలకు న్యాయం చేస్తామని 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పిస్తామని న్యాయం చేస్తామని మోసపూరితమైన మాటలు చెప్పి మాదిగలకు అన్యాయం తీరని అన్యాయం చేసినారని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మాదిగ ఉప కులాలను రాజకీయ పార్టీల బ్యానర్ కట్ట నీకు కరపత్రాలు పంచడానికి ర్యాలీలు ధర్నాలు తీయడానికి ప్రతి రాజకీయ పార్టీ నాయకుని మీటింగ్లకు ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలు మాత్రమే మీటింగ్లకు ర్యాలీలకు వస్తారని వారిని కార్యకర్తల గానే ప్రజలుగా చూడాలి తప్ప నాయకులుగా అవకాశం కల్పించడానికి అన్ని పార్టీలు సంకోచిస్తున్నాయి. ఎస్సీలనే కేటగిరీలలో మాలలకు అధిక ప్రాధాన్యతిస్తూ అన్ని రంగాలలో మాలలకు అవకాశం ఇస్తూ మారలు చేస్తున్న లాబిన్తోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆపుతున్నారని అధికార పక్షము ప్రతిపక్షం అందరూ పట్టింపులు లేకుండానే మాలల మాటకు విలువనిస్తున్నారని దుబ్బాక నియోజకవర్గం లోని మాదిగల రాజకజ రాజకీయ చైతన్య వేదిక అన్ని పార్టీలకు విజ్ఞప్తి నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలలోని కాంగ్రెస్ బిజెపి బి ఆర్ ఎస్ పార్టీలు 15 వేల ఓట్లు కలిగినటువంటి మాలలకు ప్రాధాన్యత ఇవ్వడమేంది 25 వేల కంటే ఎక్కువ ఉన్న ఓట్లు మాదిగలవి మా జనాభా మీద ఇతర అగ్రవర్ణ కులస్తుల ఆధిపత్యం తప్ప మాదిగ ఉప కులాల నాయకత్వాన్ని ఎరుగనిచ్చే పరిస్థితి కనబడతలేదు మాలలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చైతన్యం చేస్తూ మాదిగలను ఉపకులాలను తొక్కి పారేస్తున్నారని చరిత్రలో రుజువు చేస్తున్నాయి అందుకోసం దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మాదిగలంతా అన్ని సంఘాలు బిజెపి టిఆర్ఎస్ బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీలు కలగలిసి దుబ్బాక మాదిగల రాజకీయ చైతన్య వేదిక అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వేదిక నాయకత్వంలో ప్రతి మండలాల్లో మీటింగ్లు నిర్వహిస్తూ ప్రతి గ్రామానికి వెళ్లి మాదిగలను ఉపకులాలను ఓటు చైతన్యం చేస్తామని రాబోయే ఎన్నికల్లో మాదిగల ఓటు ద్వారానే బుద్ధి చెబుతామని గెలిచే పార్టీకి ఓటమి గెలుపులకు మాదిగలు నిర్ణయిస్తారని భవిష్యత్ కార్యాచరణ కోసం దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని బొంపెల్లి అక్బర్ పేట ఎక్స్ రోడ్డు మండల కేంద్రంలో ఫంక్షనాల్లో జరుగు మీటింగ్ కు మాదిగ ఉప కులాల విద్యార్థులు యువత మహిళలు ఉద్యోగస్తులు అన్ని రాజకీయ పార్టీల నాయకత్వం సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వివిధ బోధలు ఉన్నటువంటి నాయకులు మాదిగ జాతి బిడ్డలు సెప్టెంబర్ 30న హలో మాదిగ చలో భూంపల్లి మాదిగల భవిష్యత్తు కార్యచరణ రూపొందిద్దాం అన్ని పార్టీలలో ఉన్న మాదిగల ఐక్యత చాటుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బాలిగారి కృష్ణ, జంగపల్లి సాయిలు, దుర్గని నర్సింలు, ఇమ్మానియాల్ , గుండారం ఎల్లం, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు….




