బిజెపి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామ ఎంపీటీసీ రంగు భాస్కరాచారి ని నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారి చేశారు.
ఈ సందర్భంగా రంగుభాస్కరా చారి మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కి నా నియామకానికి సహకరించిన జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కి, పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత 34 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాలలో రాణించడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మండల అధ్యక్షులుగా ఉండి ప్రతి ఉద్యమంలో పాల్గొన్ననాని,అనేక సార్లు ధర్నాలు రాస్తారోకోలు చేసుకుంటూ పోతూ గంగిపల్లి గ్రామం ఎంపీటీసీగా కొనసాగుతూ గ్రామ అభివృద్ధికి,పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు..




