మర్కుక్ సెప్టెంబర్ 25
ZPHS మర్కుక్ కాంప్లెక్స్ స్కూల్ నూతన ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. వెంకటేశంని మర్కూక్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ,ఉప సర్పంచ్, గ్రామ యువకులు శ్రీనివాస్ రెడ్డి, రాజు శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థులకు విద్యతోపాటు ,విద్యార్థి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్లు గా, రేపటి భవిష్యత్తులో ఒత్తిడిని తట్టుకునే విధమైన విద్య నేర్పించాలని కోరారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు తో పాటు 10 జీపీఏ సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు, క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, అదేవిధంగా పాఠశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు మన బడి పథకం కింద అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఇంకా ఏమైనా అవసరం ఉంటే గ్రామపంచాయతీ ద్వారా పూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరహరి ప్రసాద్, వందనా మేడం, పద్మా రెడ్డి నాగేశ్వరరావు విద్యాధర్ రెడ్డి , శ్రీనివాసరావు, రమణారావు పాల్గొన్నారు
