ప్రాంతీయం

పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం

240 Views

మండల సాధన సమితి జేఏసీ అధ్యక్షులు రాజును సన్మా నించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ

 

ములుగు జిల్లా,సెప్టెంబర్ 25

 

మల్లంపల్లి మండలం నూత నంగా ఏర్పాటు జరిగిన

సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీ కృష్ణ మాట్లాడుతూ గత 09 ఏండ్లు గా మల్లంపల్లి ప్రజలు అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారానే మండలం సాధ్యం అయిందని మల్లంపల్లి మం డలం కావాలని అనేక పోరా టాలు ఉద్యమాలు చేస్తున్న క్రమములో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున సబ్బండ వర్గాలు మల్లంపల్లి మండల సాధన కోసం కులా లకు అతీతంగా మతాలకు అతీతంగా ముఖ్యంగా యువత అన్ని వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపిన మీ యొక్క ఉద్యమాల ద్వారా చిరకాల స్వప్నం అయిన మల్లంపెల్లి మండలం సాదించుకున్నందుకు

నూతనంగా ఏర్పాటు జరిగిన మల్లం పల్లి మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలు పుతూ పోరాడితే పోయేదేమీ లేదు మా అయితే భానిస సంకెళ్లు తప్పా అనే దానికి మల్లంపల్లి ప్రజలే నిదర్శనం అని నిరూపించారు.మన పోరాటాలు మన త్యాగాలు మన ఉద్యమాల ద్వారానే అనేక విజయాలు సాధించాం అనే దానికి ఇదే నిదర్శనం అని మన హక్కులను కాపాడు కోవడానికి అందరం కలసి కట్టుగా పోరాటాలు చెయ్యా ల్సిన అవసరం ఉందని మల్లంపల్లి ప్రాంత ప్రజలకు శుభా కాంక్షలు తెలుపుతూ ఉద్యమములో భాగస్వామి గా మీరు చేస్తున్న పోరాటాలకు ఉద్యమాలకు మద్దతు తెలు పుతూ నూతన మండల అభి వృద్ధికి అందరం కలసి పని చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు,జిల్లా యూత్ అధ్యక్షులు తోటకూరి శ్రీకాంత్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షు లు గాజు అజయ్,పట్టణ యూత్ అధ్యక్షులు జింక వేణు, జాతీయ బీసీ నాయకులు బక్కి నాగరాజు,జేఏసీ నాయకులు కానుగంటి సతీష్,కుక్కల సంపత్,నాయకుల శేఖర్, శ్యామల రాజు,శ్రీధర్, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *