జగదేవ్ పూర్ సెప్టెంబర్ 25
-ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాచమల్ల ఎల్లేష్
జగదేవ్ పూర్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం సబ్బండ వర్గాల విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన ధీరవనిత మరియు తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఈ నెల 26వ తేదీ మంగళవారం రోజున మండల కేంద్రమైన జగదేవ్ పూర్ అంబేద్కర్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, యువజన సంఘాల బాద్యులు ప్రభుత్వ అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తప్పనిసరిగా హాజరు కావాలని జయంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అన్యదా బావించకుండా మా ఆహ్వానాన్ని మన్నించి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల రజక సంఘం పక్షాన మనస్పూర్తిగా కోరుతున్నారు





