ముస్తాబాద్, సెప్టెంబర్ 24, మండలంలో ఇద్దరు మైనర్ బాలికలను
వేధించినట్లు ఫిర్యాదు రాగా ఇద్దరు యువకులపై ఆదివారం కేసు నమోదు చేసిన శేఖర్ రెడ్డి పోలీసులకు తెలిపారు. ప్రకారం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సర్దార్ తిరుపతి, వేములవాడ మండలం చింతల్ టానాకు చెందిన సూర రాజుకుమార్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటాము అంటూ వేధింపులకు గురిచేసారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరపరచగా 14రోజులు రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మైనర్ బాలికల పట్ల మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వేధింపులకు గురిచేసిన వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శేఖర్ రెడ్డి ఓప్రకటనలో తెలిపారు.




