ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, జీవన తోడ్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వికలాంగుల పెన్షన్ 3016 నుండి 4016కు పెంచినందుకు గాను ముస్తాబాద్ మండల అధ్యక్షులు పాతూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహంవద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండల అధ్యక్షుడు పాతూరు శ్రీనివాస్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పలువురు వికలాంగులు ఉన్నత స్థానం కల్పించి జీవనభృతి కల్పించినందుకు కేసిఆర్ కు రుణపడి జీవితాంతం ఉంటామని వారినాయకత్వం బలపరస్తామని ఆయన రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిలో చేయి చేయి కలిపి కిసాన్ అనే సర్కారు నినాదంతో మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులుగా లింగారెడ్డి, పాతూరు శ్రీనివాస్ రెడ్డి, ఎదునూరి రాములు, కోశాధికారి నందెల్లి వెంకట్రావు, మల్లేశం, బాలయ్య, వొల్లెపు మల్లేశం, రాజు, తదితరులు పాల్గొన్నారు.
