రుణమాఫీ ప్రకటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు
-పాములపర్తి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డి బాలకృష్ణ
సిద్దిపేట జిల్లా జూన్ 23
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉన్న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కి పాములపర్తి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన ఆదివారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడానికి 31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేశారని, గత 10 సంవత్సరాల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం 28 వేల కోట్లు మేర రుణమాఫీ చేసిన రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని. ఇంట్లో భార్యాభర్తల పేరునా ఉన్న రుణాలను మాఫీ చేయకుండా పెండింగ్లో పెట్టిందన్నారు. గత ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసింది అన్నారు. ప్రభుత్వం అందించిన ప్రభుత్వ అందించిన రుణమాఫీ డబ్బులు రైతులకు వడ్డీ లకే సరిపోయిందనీ. దీనితో రైతులు అప్పు చేయాల్సి వచ్చిందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కేబినెట్లో రైతుల రుణమాఫీ ఆమోదం తెలిపినందున. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపాడు
