Breaking News

జోర సంచులతో గణేష్ ని తయారు.

101 Views

వర్గల్ మండల్ సెప్టెంబర్ 24:గన్ని బ్యాగ్స్ తో
గణపతిని తయారు చేసిన కళాకారుడు దయాకర్

సన్మానించిన శ్రీరామకోటి రామరాజు.

భవంతున్ని భక్తులు ఎన్నో రకాలుగా వేడుకుంటాము. అలాగే వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా ఆధ్యాత్మిక కళతో జోర సంచులను ఉపయోగించి అద్భుతంగా భారీ వినాయకున్ని తార్చిదిద్ధాడు వర్గల్ కు చెందిన బీపార్మసీ విద్యార్థి దయాకర్ . ఇలాంటి కళాకారులకు ప్రోత్సహించడం లక్ష్యంగా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ఆదివారo శ్రీ సీతారాముల చిత్రపటంతో దయాకర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న తనంలోనే కళాత్మకతను జోడించి జోర సంచులతో గణపతి విగ్రహాన్ని రూపొందించిన దయాకర్ తన భక్తిని చాటుకున్నట్లు స్పష్టం చేశారు . చక్కటి సృజనాత్మకతను సొంతం చేసుకున్న దయాకర్ ధన్యుడని , భవిష్యత్తులో దేవుళ్ళ చిత్రాలను రూపొందించి కళలకు రూపునియ్యాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో శివ, మహేందర్, కృష్ణ, వెంకట్, రాజు, భాస్కర్, సామాజిక కార్యకర్త సాధిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *