ప్రాంతీయం

గుత్తి కోయలకు లయన్స్ చేయూత

183 Views

దోమతెరలు పంపిణి చేసిన సీఐ రాజు ఎస్ఐ కృష్ణ ప్రసాద్

 

ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 24

 

ఏటూరునాగారం మండ లంలోని పలు గుత్తికోయలకు లయన్స్ క్లబ్ అండగా నిల్చింది. ఏటూరునాగారం సీఐ మండల రాజు చొరవతో హైదరాబాద్ కి చెందిన సికింద్రాబాద్ వివేకానం దపురం లయన్స్ క్లబ్ వరంగల్ కి చెందిన లయన్స్ క్లబ్ వరం గల్ వారు సంయుక్తంగా మండ లంలోని రాయబందం చింతల పాడు,సండ్రగూడెం,కొమురం భీమ్ నగర్ లకు చెందిన సుమారు 100 కుటుంబాలకు దోమతెరలను సీఐ మండల రాజు ఎస్ఐ కృష్ణప్రసాద్ ల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్బంగా వివేకానంద పురం క్లబ్ డైరెక్టర్ పింగిలి నాగరాజు వరంగల్ క్లబ్ ప్రెసిడెంట్ పింగిలి శరత్ బాబులు మాట్లాడుతూ అత్యం త వెనుకబడిన ఆదివాసీలైన గుత్తికోయలు ఈ మధ్య వర్షా లకు జ్వరాల బారిన పడుతు న్న విషయం సీఐ తమ దృష్టికి తీసుకురాగా తమ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ చేపట్టా మని తెలిపారు.సీఐ మండల రాజు మాట్లాడుతూ గుత్తికోయ లు విష జ్వరాల నుండి అప్ర మత్తంగా ఉండాలని తమ నివాస ప్రాంతంలో అపరిచి తులకు ఆశ్రయం ఇవ్వొద్దని అలాగే డబ్బుల వ్యవహారంలో మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు.సామాజిక బాధ్యతగా అవసరార్డులకు అండగా నిలిచిన లయన్స్ క్లబ్ వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఇ కృష్ణ ప్రసాద్,లయన్ డా వద్దిరాజు, శ్రీకాంత్,ఏటూరునాగారం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *