రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామం లేతమామిళ్ల వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో అక్క పెళ్లి గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షానికి వరద నీరు అధికంగా రావడంతో అక్కపల్లి నుంచి ఎల్లారెడ్డిపేటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఎంతోమందికి ఆ వరదలు చిక్కుకొని తీవ్ర గాయాలు చేసుకున్నారు. ఇప్పటికైనా సమంత అధికారులు వెంటనే చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మించాలని గ్రామవాసులు కోరుతున్నారు.
