ప్రాంతీయం

టిపిసిసి అధినేత కాంగ్రెస్ గూటికి కనమేనిచక్ర…

435 Views
. ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 6, సీనియర్ రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి గత కొన్నినెలల క్రితమే బిజెపి పార్టీలో చేరినప్పటికి ఇటీవల ఆపార్టీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఆయనతోపాటు ఆపార్టీని వదిలి సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. గతకొన్ని రోజుల క్రితం బిజెపిలో సిద్ధాంతాలకు కట్టుబడి చురుగ్గా పనిచేసిన నాయకులు కాలక్రమేనా అసమ్మతితో నేతలంతా పార్టీనివీడి కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బిఆర్ఎస్, బిజెపి విలీనంలో ఉందని విశ్వసనీయా వర్గాలు వెల్లడించాయని కనమేని చక్రధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ కారణంవల్లే ఇదివరకే బీఆర్ఎస్ వీడి బిజెపిలోకి చేరిన కనమేని మళ్లీ బిఆర్ఎస్ బిజెపి ఒకడవడంతో తాము ఈనిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ గూటికి చేరిన వారిలో గంభీరావుపేట్ గాంధీ రావు, బండి శ్రీకాంత్, కొండాపూర్ సర్పంచ్ కర్ణాకర్, సుమారుగా ఒకేరోజు 70కి పైచిలుకు వివిధ పార్టీల నాయకులను కార్యకర్తలను రేవంత్ రెడ్డి తనపార్టీలోకి స్వాగతించి ఆయన సమక్షంలో కండువాలు వేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం కనమేని చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ అధినేత టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా బరిలో దిగిన కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *