24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.విరాహత్ అలీని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నాడు బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జ కృష్ణ, అనుబంధ సంస్థల బాధ్యులు విరాహత్ అలీని సత్కరించారు. అలాగే టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా శాఖ బాధ్యులు, సీనియర్ పాత్రికేయులు వెల్జాల చంద్రశేఖర్ తదితరులు విరాహత్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.





