ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష

27 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష.

డి జె ఎఫ్ యూనియన్ కు మద్దతు తెలిపిన మంచిర్యాల జిల్లా బిజెపి నాయకులు.

కాంగ్రెస్ గెలుపులో విలేకరులు లేరా..?

కాంగ్రెస్ పార్టీని హైప్ చేసిందే విలేకరులు, యాది మరిచారా ?

చిన్న పత్రికలు, వెబ్ న్యూస్ డిజిటల్, యూట్యూబ్ చానల్లే కదా చక్రం తిప్పింది.

గత ప్రభుత్వం పట్టించుకోలేదు- నేటి ప్రభుత్వం నెట్టేస్తుంది చూద్దాం అంటున్న జర్నలిస్టులు –      డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి .

మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ ప్రాంగణంలో డెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆద్వర్యంలో మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ప్రింట్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ న్యూస్ డిజిటల్ ,యూట్యూబ్ ఛానల్ సభ్యులు ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు మోకనపల్లి బద్రి మరియు మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను మరిచి ,కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకంలో కనీస అవకాశం కూడా కల్పించడం లేదు, ఎలక్షన్ల సమయంలో ప్రజలకు, జర్నలిస్టులకు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుండని గుర్తు చేయడం తప్పా? జర్నలిస్టులను ప్రతిపక్ష పార్టీగా చూస్తూ.. ప్రతి విషయంలో చులకన భావంతో చూసిన, ఏ ప్రభుత్వం ఇప్పటివరకు చరిత్రలో నిలిచినట్టు లేదు అనేది చరిత్ర చెబుతున్న సత్యం, యాది మరిచారా ?రేయింబవళ్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజా సమస్యలు పాలకులకు ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజలకు ఏం కావాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు తెలియజేసినందుకేనా ?మాకు ఈ శిక్ష , సమాజ శ్రేయస్సు కోసం పాటుపడితే చిన్నచూపు చూస్తారా ?పైసా జీతం లేకుండా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవించే జర్నలిస్టును ,దిక్కులేనివాడుగా చూస్తున్నారు .ఇది తగునా ? ఇప్పటికైనా మీరిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు భద్రత కల్పించి ,ప్రభుత్వం తరఫున ప్రతి జర్నలిస్టుకి మీరు ఇస్తానన్న రెండు గుంటల ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్ రూమ్ లేదా ఇందిరమ్మ ఇల్లు ,అదేవిధంగా జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వ ఆరోగ్య కార్డు అందించి ,జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలని కోరుతున్నారు. ఇవేమీ ప్రభుత్వం తీర్చలేని పెద్ద సమస్యలేమి కావు ,ఈ చిన్న సమస్యల్ని ప్రభుత్వం వెంటనే తీర్చి, జర్నలిస్టుల ఔన్నత్యానికి, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలను కూడగట్టుకుని, డి జె ఎఫ్ ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో రిలే నిరాహార దీక్షలు దశలవారీగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు .

ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కి వినతి పత్రం అందజేశారు .

ఈ కార్యక్రమంలో.. డి జే ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బర్ల తిరుపతి, గౌరవ అధ్యక్షులు అనపర్తి కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా పెళ్లి రాజేందర్, దుర్గం వెంకటస్వామి, డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ,రాష్ట్ర అధ్యక్షులు మోట పలుకుల వెంకట్ ,ఉపాధ్యక్షులు మారేపల్లి గోపాల్ రెడ్డి ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్, కుర్రే శ్రీకర్, జర్నలిస్ట్ జేఏసీ సభ్యులు బింగి సుధాకర్ ,మధునేష్ ,శ్రీనివాస్, మధు మరియు డీజే సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అదేవిధంగా, మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, దుర్గం అశోక్, ముఖేష్ గౌడ్, ఆరుముళ్ళ పోషం , దీక్షితులు మరియు బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి వారి సంపూర్ణ మద్దతు తెలిపారు.

మా రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మంచిర్యాల జిల్లాలోని బిజెపి మిత్రులకు.. మా డి జె ఎఫ్ తరఫున పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్