దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంగలి నాగరాజు, అనారోగ్యంతో మృతి చెందిన ముత్యం గారి సత్తయ్య, కుమ్మరి బిక్షపతి, ఉపర్పల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ సోదరుడు లక్ష్మణ్ ల కుటుంబాలను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, సత్యనారాయణ గౌడ్, రంజిత్ గౌడ్, అనిల్ రెడ్డి, శ్రీనివాస్, గణేష్, సుచిత్ గౌడ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు….




