ప్రాంతీయం

మహిళా బిల్లు ఆమోదం ప్రశంసనీయం

99 Views

మహిళా బిల్లు ఆమోదం ప్రశంసనీయం

– సర్పంచ్ సంధ్యారాణి గణేష్

మహిళా బిల్లు ఆమోదం ప్రశంస నీయమని రామసాగర్ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా బిల్లు ఆమోదం పొందేందుకు ఎమ్మెల్సీ కవిత నిరంతర పోరాటం వల్లనే సాధ్యమైందని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం మరువలేనిదని తండ్రికి తగ్గ తనయుగ ఎమ్మెల్సీ కవిత మహిళా లోకం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నదని సీఎం కేసీఆర్ పోరాటపటిమ ఎమ్మెల్సీ కవిత రక్తంలో ఉందని అన్నారు. రెండున్నర దశాబ్దాల నిరీక్షణ. అనంతరం మరో కొత్త శకానికి తెర లేపిన మహిళా రిజర్వేషన్ బిల్లు. కొత్త పార్లమెంట్ లో చారిత్రక బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయని మహిళా రిజర్వేషన్ సాధన కోసం డిల్లీలో మహిళా బిల్లు ఆమోదం కోసం నిరంతరం కృషి చేసిన ముఖ్య మంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *