దౌల్తాబాద్: సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ గౌడ్ సోదరుడు ఆంజనేయులు గౌడ్ ఇటివల అనారోగ్యంతో బాధపడుతూ కార్పోరేట్ వైద్య నిమిత్తం యశోద ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇంటికి చేరుకోగా విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు వారి నివాసానికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. మెరుగైన వైద్యసేవలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, సత్యనారాయణ గౌడ్, రంజిత్ గౌడ్, సుజిత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు…




