దౌల్తాబాద్ : మహాత్మ జ్యోతీబాపూలే బాలుర గురుకుల విద్యాలయాల ఉమ్మడి జిల్లా క్రీడలు శనివారం దౌల్తాబాద్‌లో ముగిశాయి. అండర్ 17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాలలు గెలుపొందాయి. ఖోఖోలో తునికి, దౌల్తాబాద్, కబడ్డీ సదాశివపేట, దిగ్వాల్,వాలీబాల్ కౌడిపల్లి, సదాశివపేట, టెన్నికాయిట్ తునికి, దౌల్తాబాద్, క్యారమ్స్ సదాశివపేట, దిగ్వాల్, చెస్ సదాశివపేట, గద్వాల్ జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత, ప్రిన్సిపాల్ శోభారాణి, పీడీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




