మంచిర్యాల జిల్లా.
నేడు అంతర్జాతీయ యోగం నాలుగో రోజు సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు ఆయుష్ యోగ తరఫున స్కూల్ గ్రౌండ్ నందు యంగ్ ఎంకరేజింగ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. యంగ్ యువకులకు యోగ వలన ఇలాంటి ప్రయోజనాలు తెలియజేయడం జరిగింది వీరి ద్వారా సమాజంలో రేపటి తరానికి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిని వాళ్లకు వివరించి చెప్పడం జరిగింది యువకుల్లో ఆటల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి మానసిక ప్రశాంతతను ఏ విధంగా పొందవచ్చును చదువులు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళవచ్చును యంగ్ యువకుల్లో ఉత్సాహం ఏ విధంగా పెంపొందించుకోవచ్చును మనం ఏ విధంగా జీవనశైలిలో సంతోషంగా ఉత్సాహంగా జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చును ప్రశాంతమైన జీవితాన్ని ఉత్సాహాన్ని ఉన్నతంగా జీవించడానికి మార్పు తీసుకురావడం కోసం యోగా అంతర్జాతీయ ఉత్సాహ సందర్భంగా మన బాయ్స్ స్కూల్ గ్రౌండ్ నందు యంగ్ యువకుల అందరికీ యోగా ద్వారా వారికి తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయుష్ యోగ ఇన్స్ట్రక్టర్స్ ఏ. సుధాకర్ మరియు మేఘన ఆయుష్ యోగ డాక్టర్ పద్మజా గారు పాల్గొని వివరించడం జరిగింది.
