హుస్నాబాద్ ను జిల్లా చేయాలి
ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు
పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 23, ( తెలుగు న్యూస్ 24/7
హుస్నాబాద్ అంటేనే పోరాటాల ఖిల్లా ఉద్యమాల గడ్డ ఏ ఉద్యమమైన హుస్నాబాద్ నుండి మొదలు కావాల్సిందే అటువంటి నాయకత్వం ఉంది ఇటు పొట్లపెల్లి లో స్వయంభు రాజరాజేశ్వర దేవస్థానం, అటు ఉమ్మాపూర్ గుట్టల్లో బయన్నదేవుడు, ఇటువైపు కొత్త కొండ వీరభద్ర స్వామి మరోవైపు సమ్మక్క సారలమ్మ, సర్వాయి పాపన్న, ఈ విధంగా ఇంకా ఎన్నో దేవస్థానాలు పుణ్యక్షేత్రాలు, ఆసియా ఖండంలో అతిపెద్దదైన స్తూపం, ఉమ్మాపూర్ గుట్టల్లో వెనుకటి ఆనవాళ్లు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడిన గోడలు హుస్నాబాద్ ఎల్లమ్మ జాతర రాయికల్ వాటర్ ఫాల్స్ గట్ల నర్సింగాపూర్ లక్కాకులమ్మ ఆహ్లాదకరమైన గుట్టలు ఎటు చూసినా కరీంనగర్, సిద్దిపేట్, హనుమకొండ ఇలా మూడు జిల్లాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా హరిజన, గిరిజన ప్రజలు నివాసం ఉంటారు ఇక్కడ ప్రజలు అనారోగ్యంతో బాధపడితే 40 కిలోమీటర్ల దూరం ఉన్న మూడు జిల్లాలకు వెళ్లాల్సిందే ప్రమాదం ఎక్కువైతే మధ్యలో మరణించాల్సిందే, ఇక్కడి పిల్లలు పై చదువుల కోసం మూడు జిల్లాలకు వెళ్లాలి ఇక్కడ నుండి ప్రయాణం చేసి పాఠశాలకు గాని కళాశాలలకు గాని వెళ్లాలంటే సమయం ఉండదు ఒకవేళ హాస్టల్ లో ఉండాలంటే డబ్బులు ఉండవు . ఇక్కడ రైతులు పండించిన అనేక రకాల పంటలను అమ్ముకోవాలంటే వాహన సదుపాయం లేక దగ్గరలో ఉన్న దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిందే ఇలా చెప్పుకుంటూ పోతే విద్య, వైద్యం, ఉపాధి లేక ఎన్నో అవస్థల పాలవుతున్నారు.హుస్నాబాద్ వాసులు అందుకే ఇవన్నీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం మంత్రి స్పందించి హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపకుండా కరీంనగర్ జిల్లా నుంచి మూడు మండలాలు సిద్దిపేట జిల్లా నుంచి మూడు మండలాలు హన్మకొండ జిల్లా నుంచి మూడు మండలాలు తీసి హుస్నాబాద్ లో ఉన్నటువంటి ఏడు మండలాలను కలుపుకొని 16 మండలాలతో హుస్నాబాద్ ను జిల్లా చేసినట్లయితే అన్ని సదుపాయాలు హుస్నాబాద్ లో ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ నష్టం జరగకుండా హుస్నాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ హుస్నాబాద్ ను జిల్లా చేయాలని కోరుతున్నాను.





