ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు వినతి
ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 23
ఏటూరునాగారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయా లని ఆధార్ కేంద్రం మండల కేంద్రంలో లేక పోవడం వల్ల పక్క మండలంలో ఉన్న ఆధార్ సెంటర్ వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత ఏటూరు నాగారం తాసి ల్దార్ కు బిజెపి నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ స్పందిస్తూ ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఉండే విధంగా చూస్తా నని తెలిపారు.ఈ కార్యక్ర మంలో జాతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,యువమోర్ష మండల అధ్యక్షులు చక్రి, బూత్ కమిటీ ఇన్చార్జ్ ఎలుకపర్తి శీనన్న,తదితరులు పాల్గొన్నారు.