రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీని శనివారం పార్టీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన దొమ్మాటి నరసయ్యను సన్మానం చేశారు. మండల కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా గంట బుచ్చగౌడ్. కొత్తపల్లి దేవయ్య,ప్రధాన కార్యదర్శులుగా దండు శ్రీనివాస్, సిరిపురం మహేందర్, కార్యదర్శులుగా చెట్టుపెళ్లి బాలయ్య,ఎండి హిమాం కోనేటి పోచయ్యలను ను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారుగా కల్లూరు బాపురెడ్డిని నియమించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి వీరిని సన్మానించారు.
అనంతరం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు హరిలాల్ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ గిరిజన సంఘం అధ్యక్షుడిగా నవీన్ కు నియామక పత్రం అందజేశారు. ఈ కమిటీని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అభినందించారు.
కార్యకర్తల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకు తగిన విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి నాయకులు పందిర్ల శ్రీనివాస్ సూడిద రాజేందర్ చెన్ని బాబు బానోతు రాజు నాయక్ వంగ మల్లారెడ్డి ఎండి రఫీక్ అనవేని రవి తిరుపతి రెడ్డి చెరుకు ఎల్లయ్య బిపేట దేవరాజు అన్ని గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు
